Start Date | End Date | Event |
---|---|---|
22 May 2025 Thursday | 22 May 2025 Thursday | Hanuman Jayanti |
10 July 2025 Thursday | 10 July 2025 Thursday | Guru Purnima |
29 July 2025 Tuesday | 29 July 2025 Tuesday | Nag Panchami |
08 Aug 2025 Friday | 08 Aug 2025 Friday | Varalakshmi Vrat |
16 Aug 2025 Saturday | 16 Aug 2025 Saturday | Krishna Janmashtami |
27 Aug 2025 Wednesday | 27 Aug 2025 Wednesday | Ganesh Chaturthi |
వార్షిక కార్యక్రమాలు
మాఘమాసం: ప్రతి సంవత్సరము మాఘమాసం లో ఏడు రోజులపాటు రామనామ సప్తాహము జరుగును
మూడవ ఆదివారం శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి తిరునాళ్ళ సందర్భంగా అన్నదానం నిర్వహించబడును
ప్రతి ఉగాదికి ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం జరుగుతుంది ఆలయ పరిసర ప్రాంతాల్లోని ఐదు పల్లెల వృద్ధులకు వస్త్ర దానం ఊత కర్రల వితరణ జరుగుతుంది.
నూతన సంవత్సరము ఉగాది పర్వదినమున తెలుగు దిన సూచిక ఆవిష్కరణ జరుగును.ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు వస్త్ర దానం జరుగును.
శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం, అన్నదానము నిర్వహించబడును
వైశాక మాసం లో జరుగు స్వామి వారి జయంతి సందర్భంగా దేవాలయము నందు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతుంది. వృద్ధులకు వస్త్ర దానం ఊత కర్రలు విరివిగా ఇవ్వబడతాయి మూడవ రోజున స్వామి వారి ఊరేగింపు అనంతపురం నగర వీధుల్లో నిర్వహించబడును
భాద్రపద మాసం: భాద్రపద మాసంలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.
కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది
ప్రతి సంవత్సరం శ్రావణ: కార్తీక, మాఘ మాసములలో ప్రతి ఆదివారం గోపూజ నిర్వహించడం జరుగుతుంది.కరువు కాటకాలతో మరిచిపోయిన ఆడపడుచుల వడిబియ్యం, శ్రీమంతం లాంటి కార్యక్రమాలను కొన్ని వందల మంది మహిళలతో నిర్వహించి పరిసర పల్లె ప్రాంతాలకు ఇటువంటి సాంప్రదాయ కార్యక్రమాలను పునః పరిచయం చేయడం జరిగింది.
ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
పెళ్లిళ్లు పేరంటాలు శుభ కార్యక్రమములకు ఎటువంటి వసతి లేని సోముల దొడ్డి ప్రాంత ప్రజల అవసరార్థమై దాదాపు రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఒక కళ్యాణ మండపము నిర్మాణం చేయబడింది. బీద హిందూ బంధువులు అన్ని వసతులతో ఉచితంగా ఈ కళ్యాణమంటపమును ఉపయోగించుకోవచ్చు




